Tags » Swathi

ప్రతీ పూజకి ఫలితం ,ప్రతీ ప్రేయర్ కి ఆన్స్వర్ --"కార్తికేయ"

సైన్సు కి ,భక్తికి తరతరాలగా జరుగుతున్న సంఘర్షణ నేపధ్యంలో చాలా సినిమాలే వచ్చాయి ,అవన్నీ విజయం సాదించాయి కూడా ,అలాంటి నేపధ్యంలో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక అరుదైన చిత్రమే ఈ “కార్తికేయ”..

కథ విషయానికి వస్తే కార్తికేయ(నిఖిల్) మెడిసన్ ఆఖరి సంవత్సరం చదువుతుంటాడు ,ఇత గాడికి ప్రశ్న ఎదురైతే దానికి సమాధానం కనిపెడితే కానీ నిద్రపట్టదు ,అలాంటి నిఖిల్ సుభ్రమణ్యపురం అనే ఊరిలో అనూహ్యంగా మూతపడిన ఒక ఆలయం రహస్యాన్ని చేధించడానికి పూనుకొంటాడు ,ఇతనికి ముందు ఈ గుడి రహస్యాన్ని చేధించడానికి వచ్చిన ఒక దేవాదాయ శాఖ అధికారి ,ఇంకో పోలీసు అధికారి విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోతారు ,మరి కార్తికేయ ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కుని విజయం సాధించాడా ,అనేది మిగిలిన కథ …

ప్రథమార్ధం అంతా నిఖిల్ ,కుటుంభ సభ్యులు అతని స్నేహితులు ,స్వాతితో ప్రేమ ,సుభ్రమణ్యపురం చేరుకోవడం ,ఇలా త్వర త్వరగా గడిచిపోతుంది …

ద్వితీయార్ధంలో కొంచం విసుగు తెప్పించారు దర్శకుడు ,అసలు విషయం చిన్నదే కావటం వల్ల ద్వితీయార్ధంలో చివరి అరగంట వరకు నీరసంగానే గడిపాడు ..

నిఖిల్ నటన చాలా మెరుగైంది ,మేక్ అప్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే మరింత  బాగుండేది అనిపించింది …

స్వాతీ అందం కొంచం పాడైనట్లే అనిపించింది ..నటన పరం గా ఈమె పాత్రకి అవకాశం తక్కువే …

పోలీస్ అధికారిగా చేసిన కిశోర్ బాగానే చేసాడు కానీ ,తన పాత్ర నిడివి పెద్దదిగా ఉంటె బాగుండేది …

రావు రమేష్ ,తనికెళ్ళ భరణి వాళ్లకి బాగా అలవాటైన పాత్రలే చేసారు …

హీరో మిత్ర బృందంగా చేసిన “స్వామి రా రా ” నటులు అందరు మంచి హాస్యం పండించారు …

దర్శకుడు చందు కొత్త వారైనా కథలో బిగువు తగ్గకుండా చూస్కున్నారు ,విషయం చిన్నదే అయినా రెండు గంటలకు చెప్పాలని తాపత్రయం వల్ల ,ద్వితీయార్ధం కొంచం నీరసం అనిపిస్తుంది ,పతాక సన్నివేశం మాత్రం దేవుడు అనేది ఒక ప్రశ్న గానే మిగిల్చారు …

శేఖర్ చంద్ర స్వర సారధ్యంలో సంగీతం పర్లేదు ,రెండు పాటలు బాగున్నాయి ,నేపధ్య సంగీతం బాగుంది …

మొత్తంగా చెప్పాలంటే ఒక మంచి థ్రిల్లర్ ఈ కార్తికేయ ,చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుంటే తప్పక చూసి ఆనందించవచ్చు …

Telugu Movie