Tags » TDP

Daily Prompt: Full Disclosure

Daily Prompt : Full Disclosure
A mad scientist friend offers you a chip that would allow you to know what the people you’re talking to are thinking. 74 more words

The Daily Post

The 4 Positive Ways to Change the Way People Listen to You

  • Human voice is the most powerful sound on earth (can start wars or express affection), but we fall into seven deadly sins of speaking, which are: gossip, judging, negativity, complaining, excuses, lying (exaggerating is a form of this) and dogmatism (where you confuse facts with opinions).
  • 109 more words
CEO

Vivid Long Weekend and wrap up...

Well, as they say, it isn’t Vivid Sydney without rain! As the clouds rolled in the last few nights of Vivid, we decided the show must go on… 79 more words

ANMM Events

Industry Loving Naidu

Elections are over and with dream of  shining India in the eyes, this country has started it’s new innings.. India has seen it’s ‘Arab Spring’ and a corruption free and fast growing  country, with better living is desired. 684 more words

India

చంద్ర బాబు నాయుడు గారి మెలికలు

1. రైతురుణమాఫీ బిల్లు మీద తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసంతకం పెడతానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు డొంకతిరుగుడు పద్ధతి అవలంబించారు. తొలి సంతకం చేస్తానని ప్రకటించినంత దమ్ముగానే ఆచరించడం అనేది ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మాత్రమే చెల్లుబాటు అయిన విషయం అని చంద్రబాబు మరోమారు నిరూపించారు. 16 more words

ప్రముఖ విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రస్థానంపై టీవీ-5 ప్రత్యేక కథనం

సూత్రధారి… పాత్రధారి అయ్యాడు. కష్టే ఫలి అనే సూత్రాన్ని ఆచరణలో చూపించి విద్యారంగంలో మేరునగధీరుడిగా నిలిచిన నారాయణకు ఇప్పుడు మంత్రి పదవి దక్కింది. ఏ సభలో సభ్యుడు కాకున్నా తెలుగుదేశాధీశుడి కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో ఇప్పటివరకు తెరవెనక ఉండి వ్యూహ రచనలో అధినేతకు సహాయం చేసిన ఆయన… ఇప్పుడు తెరపైకి వచ్చారు. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చే ప్రయత్నంలో భాగస్వాములవుతున్నారు. అపార మేధస్సుతో చంద్రసేనలో చోటు దక్కించుకున్న ప్రముఖ విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రస్థానంపై టీవీ-5 ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో 14 మంది కొత్త వారికి చోటు దక్కినా… పొంగూరు నారాయణ ప్రత్యేకతే వేరు. ఎంతో మంది సీనియర్లున్నా…. ఏ చట్టసభలోను సభ్యుడు కాకున్నా… ఆయన్ను మంత్రి పదవి వరించింది.  సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన నారాయణ అంచలంచెలుగా ఎదిగారు. ఓ బస్సు కండక్టర్‌ కుమారుడైన ఆయన శ్రమయేవ జయతే అన్న సూక్తిని ఆచరణలో పెట్టారు. స్వశక్తితో కష్టపడి చదివి విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. విద్యార్థి దశలో బంగారు పతకాలు సాధించిన నారాయణ…. విద్యా సంస్థలను స్థాపించి ఎందరో విద్యార్థులను దేశానికి అందించారు.

1979లో ఎమ్మెస్సీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన నారాయణ తనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఆరువేల వేతనంతో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఇంజనీరింగ్, మెడిసిన్ ఎంట్రన్స్‌పై  విద్యార్థులకు అవగాహన లేకపోవడాన్ని గమనించిన నారాయణ నెల్లూరులోని ఓ చిన్న గదిలో ఐదుగురు విద్యార్థులతో ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. 1985కే రాష్ట్రస్థాయిలో నారాయణ కోచింగ్ సెంటర్ పేరు మారుమోగింది. ఇదే స్ఫూర్తితో 1990లో నెల్లూరులో హైస్కూల్, రెసిడెన్షియల్ మహిళా కళాశాల నెలకొల్పారు. 1999లో నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలలో ఐఐటీ కోచింగ్ సెంటర్లు నెలకొల్పారు. అదే సంవత్సరంలో నెల్లూరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. 2001లో డెంటల్ కళాశాల నెలకొల్పడమే కాక 13 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు నెలకొల్పారు. అంతేకాదు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఎంతో మందిని ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ విద్యారంగంలో కొత్త పోకడలు సృష్టించారు. తన అపార అనుభవం, మేధస్సుతో నాణ్యమైన విద్యకు మారుపేరుగా నారాయణ విద్యా సంస్థలను తీర్చిదిద్దారు నారాయణ.

విద్యారంగంలో సంచలనం సృష్టించిన నారాయణ ప్రజాసేవ చేయాలనే మక్కువతో టీడీపీకి దగ్గరయ్యారు.  చొరవ, విద్యారంగంలో అపార అనుభవం, మేధస్సు కలిగిన ఆయన సహజంగానే అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దీంతో బాబు ఆయన్ను తన వ్యూహ బృందంలో చేర్చుకున్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు, వివాద పరిష్కర్త, సంధాన శీలి, సమన్వయ కర్త వంటి ఎన్నో లక్షణాలు ఉండడంతో చంద్రబాబు నారాయణకు ఎన్నో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన టీడీపీకి చేసిన సేవలు వెలకట్టలేనివి. ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలో టీడీపీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అధినేత అప్పగించిన బాధ్యతలను పూర్తి అంకితభావంతో నేరవెర్చి శభాష్ అనిపించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేత, ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి రావడానికి నారాయణే కారణం. ఇదొక్కటే కాదు… తెరవెనక ఉండి చంద్రబాబు ఎన్నికల వ్యూహంలో పాలు పంచుకొన్నారు. మొన్నటి ఎన్నికల్లో కోస్తాంధ్ర టీడీపీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా నారాయణ ప్రత్యక్షమయ్యేవారు. అందుకే చంద్రబాబు ఏరికోరి, ఎందరో సీనియర్లను పక్కనబెట్టి, ఏ సభలో సభ్యుడు కాకున్నా… నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టారు. తద్వారా నవ్యాంధ్ర సాధనలో ఆయన్ను భాగస్వాములు చేస్తున్నారు.

Andhra Pradesh News