Tags » Crime

3Novices : Web of investigations entangles Israel's "King Bibi"

By Luke Baker and Maayan Lubell JERUSALEM (Reuters) – Benjamin Netanyahu has spent 30 years in public office, including 11 years as Israel's prime minister, but this year his political future is being called into question as seldom before. 58 more words

News

3Novices : China's top graft buster says officials should be made to sweat

Chinese officials must become used to routinely "blushing red and sweating" in the country's fight against corruption, China's top graft buster said in comments published on Thursday. 83 more words

News

రోడ్డుప్రమాదంలో 24 మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎటా జిల్లాలోని అలీగంజ్‌లో గురువారం ఉదయం పాఠశాల బస్సు-ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 24 మంది చిన్నారులు మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి దట్టమైన పొగమంచే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పొగమంచు కారణంగా పాఠశాలలు మూసివేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినప్పటికీ… ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ పాఠశాలలను తెరుస్తున్నారని రాష్ట్ర డీజీపీ తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగిందని ఆయన వెల్లడించారు.

Crime

యువతిని వేధించిన రిజర్వ్‌ ఎస్‌ఐ అరెస్ట్‌

యువతిని వేధించిన రిజర్వ్‌ ఎస్‌ఐని విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖలోని కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కప్పరాడ రాంజీ ఎస్టేట్‌లో ఓ యువతి నివాసముంటూ డాబా గార్డెన్స్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఈమె స్నేహితురాలు ఆచూకీ వారం రోజులుగా తెలియడం లేదు. అయితే ఈ కేసులో రిజర్వ్‌ ఎస్‌ఐ జీవీఎన్‌ ప్రసాద్‌ యువతిని బెదిరిస్తున్నాడు. బుధవారం రాత్రి యువతికి ఫోన్‌ చేసి నీ స్నేహితురాలు చనిపోయింది.. దీనిలో నీ ప్రమేయముంది కాబట్టి నీపై హత్యకేసు పెడతానంటూ భయపెట్టాడు. ఎక్కడ ఉంటున్నావో చెప్పాలంటూ నిలదీశాడు. దీంతో బెదిరిపోయిన ఆ యువతి తన అడ్రస్‌ చెప్పడంతో అర్థరాత్రి అక్కడకు వచ్చిన ప్రసాద్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో పారిపోయిన యువతి స్థానికుల సాయంతో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు రిజర్వ్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు కంచరపాలెం సీఐ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ప్రసాద్‌ విజయవాడలో రిజర్వ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నట్లు సమాచారం.

Crime

హత్యకేసులో నలుగురి అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చింతాయగూడెంలో పెద్దిరాజు హత్యకేసులో పోలీసులు నలుగురిని అరెస్టుచేశారు. వరంగల్‌ జిల్లాలో ఉన్న ఈ నలుగురు నిందితులను గణపవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

Crime

డీఎస్పీ ఆస్తులు రూ.2 కోట్లు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ)లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న దేవిశెట్టి దుర్గాప్రసాద్‌ ఇళ్లలో బుధవారం అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో అనిశా డీజీ ఠాకూర్‌ ఆదేశాల మేరకు కేంద్ర నిఘా విభాగ డీఎస్పీ, అనిశా డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. డీఎస్పీలు రమాదేవి, ప్రభాకర్‌, సైలాభాను, జైరామ్‌రాజు, మహేష్‌లతో పాటు 12 మంది ఇన్‌స్పెక్టర్లు 11 బృందాలుగా ఏర్పడి 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. గుంటూరు బ్రాడీపేటలోని డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఇంటితో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల, ప్రకాశం జిల్లా చీరాల, హైదరాబాద్‌లలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో డీఎస్పీ దుర్గాప్రసాద్‌ గుంటూరు బ్రాడీపేటలోని తన నివాసంలో ఉన్నారు. ఆయన ఇంటిని డీఎస్పీ రమాదేవి బృందం తనిఖీ చేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సోదాల్లో 14 ఇళ్ల స్థలాలతో పాటు 11.70 ఎకరాల పొలాలు, నాలుగు ఎల్‌ఐసీ బాండ్లు, మూడు కిలోల వెండి, ముప్పావు కిలో బంగారం, రూ.50 వేల నగదుతో పాటు ఒక బ్యాంక్‌ లాకర్‌లో 16 తులాల బంగారం గుర్తించామని డీఎస్పీ రమాదేవి తెలిపారు. సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.2 కోట్లు విలువ చేసే ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బినామీల పేరిట భారీగా ఆస్తులు: గుంటూరు జిల్లా నల్లపాడులో ప్లాటుతో పాటు ఇటీవల ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చీరాలలో రూ.20లక్షలతో ప్లాటు కొనుగోలు చేసినట్లు సోదాల్లో గుర్తించారు. ఆయన అత్త పేరుతో గుంటూరు కంకరగుంటలో సొంతిల్లు, 8 ప్లాట్లు, బుడంపాడులో 1.47 ఎకరాల భూమి ఉంది. ఆయన ఎస్సైగా పనిచేసే కాలం నుంచి సన్నిహితంగా వ్యవహరించే రమేష్‌ పేరుతో నారాకోడూరు, కర్లపాలెం, బుడంపాడు, కోమలిలో 11 ఎకరాలకుపైగా భూములున్నాయి. పేద కుటుంబానికి చెందిన రమేష్‌, ఆయన తండ్రికి తెల్లకార్డులున్నాయి. మరో బినామీగా ఉన్న తెల్లకార్డుదారు టి.సుబ్బారావు పేరుతో గుంటూరులో ఒక ఇల్లు ఉంది. ఆయన పేరుతో ఉన్న స్టోన్‌క్రషర్‌ యూనిట్‌కు ఆర్థిక సహకారం దుర్గాప్రసాద్‌ అందించినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ 1991లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరి 2007లో సీఐగా పదోన్నతి పొందారు. పట్టాభిపురం సీఐగా పనిచేసే సమయంలో సివిల్‌ వివాదంలో తలదూర్చి సస్పెన్షన్‌కు గురయ్యారు. అది తొలగిన తర్వాత 2014లో డీఎస్పీగా పదోన్నతి లభించింది.

బాణసంచా కాల్చిన బాధితులు: డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది ఆయన ఇంటిముందు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గుంటూరులో పనిచేసినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని, అక్రమంగా కేసులు బనాయించాడంటూ వారు వాపోయారు.

Crime

రోడ్డుప్రమాదంలో 24 మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎటా జిల్లాలోని అలీగంజ్‌లో గురువారం ఉదయం పాఠశాల బస్సు-ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 24 మంది చిన్నారులు మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి దట్టమైన పొగమంచే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పొగమంచు కారణంగా పాఠశాలలు మూసివేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినప్పటికీ… ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ పాఠశాలలను తెరుస్తున్నారని రాష్ట్ర డీజీపీ తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగిందని ఆయన వెల్లడించారు.

Crime