Tags » Intresting Facts!!!!

Interesting facts about Yarn

The word yarn comes from Middle English , from the Old English gearn, akin to Old Hight Germans’s garn yarn, Geek’s chordē string, and Sanskrit’s hira band.

Intresting Facts

గాజులు ధరించడం వెనుక మనకు తెలియని నిజాలు.!

భారతీయ మహిళలు గాజులను ధరించడం ఎప్పుడో పురాతన కాలం నుంచే సాంప్రదాయంగా వస్తోంది. గాజులను మహిళ వైవాహిక జీవితానికి నిదర్శనంగా భావిస్తారు. పెళ్లి కాని వారైతే అందం, ఆకర్షణ కోసం ధరిస్తారు.

అయితే కేవలం ఇవే కాదు, గాజులను ధరించడం వెనుక మనకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే…

*.భారతీయ ఆచార వ్యవహారాల, నమ్మకాల ప్రకారం బంగారు, వెండి ఆభరణాలు మహిళలకు శక్తినిస్తాయి. చేతులపై బంగారు గాజులు ధరించడం వల్ల ఎముకలకుదృఢత్వం చేకూరుతుంది. అంతేకాదు ఇవి నిరంతరం దేహానికి తగులుతూ ఉండడం వల్ల వాటిలోని సూక్ష్మ పదార్థాలు, అణువులు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఇలాంటి బంగారు, వెండి అణువులు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

*.గాజులను ధరిస్తే మహిళలు, వారి భర్తలు ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని మతాల్లో నమ్ముతారు.

*.గాజులు లేకపోతే అలంకరణ అసంపూర్తిగా ఉన్నట్టేనని హిందువుల్లో అధిక శాతం మంది నమ్ముతారు.

*.మహిళలు గాజులను ఎల్లప్పుడూ ధరించి ఉండడం వల్ల వాటి ద్వారా వచ్చే శబ్దాలు ఇండ్లలో ఉండే దుష్ట శక్తులను తరుముతాయని హిందూ సాంప్రదాయంలో నమ్ముతారు.

అంతేకాదు గాజుల శబ్దాలు ఎక్కువగా ఉంటే ఆ నివాసం దైవానికి నెలవని నమ్ముతారు.

Intresting Facts