Tags » Life Tricks

కొంప ముంచిన అంబానీ, జియో ఫోన్ కొనాలనుకున్న వారికీ బ్యాడ్ న్యూస్..!

500 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఫ్యూచర్స్ తో ఉన్న ఫోన్ ను ఉచితంగా ఇవ్వనున్నట్లు రిలయన్స్ వార్షికోత్సవంలో ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.వినియోగదారులు 1500 డిపాజిట్ చేస్తే ఈ ఫోన్ లను ఇస్తామని మళ్లీ ఆ మొత్తాన్ని మూడేళ్లలో తిరిగి వినియోగదారునికి చెల్లిస్తామని ప్రకటించారు. దీనికోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన సందేహాలపై ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు.ఈ ఫోన్ ఒక్క సిమ్ కు మాత్రమే పరిమితం డ్యూయల్ సిమ్ ఇందులో వేయడానికి లేదు అలాగే ఇందులో జియో సిమ్ తప్ప వేరే నెట్ వర్క్ లకు సంబంధించిన సిమ్ వేస్తే అది పనిచేయదు అని చెప్పారు.అలాగే అక్టోబర్ లో మరో జియో ఫోన్ రాబోతుందని అందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుందని టెలికాం సర్కిల్ లో ఒక ప్రచారం జరుగుతుంది. అంతేకాక ఈ జియో ఫోన్ గురించి అనేక సందేహాలు దీనిపై నెగటివ్ కథనాలు వస్తున్నాయి.అలాగే ఫోన్ అన్నాక బోలెడు ఆప్షన్స్ ఉంటాయి కానీ ఓ రకంగా పైసలు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఇందులోనీ ఫ్యూచర్స్ ను చాలా వరకు తగ్గించినట్లు సమాచారం.

అలాగే ఇందులో వాట్స్ ఆప్ పని చేయదు దీనికి బదులుగా జియో చాట్ ఉంటుంది దీనిద్వారా కమ్యూనికేషన్ కొనసాగించాలి. అలాగే ఈ ఫోన్ ను మూడు నెలలు వరుసగా రీఛార్జ్ చేయకుంటే మళ్లీ కంపెనీ కి రిక్వెస్ట్ పెట్టీ రీఛార్జ్ చేసుకోవాలి.ఇలా ఈ ఫోన్ మార్కెట్ లోకి రాబోయే లోపు ఇంకా ఎన్ని లోపాలు బయటకు వస్తాయో. మొత్తానికి 1500 రూపాయలతో 4G హై స్పీడ్ ఇంటర్నెట్ ను వాడుకునెలా స్మార్ట్ ఫోన్ ఇస్తే ఇంటికి 3 లేక 4 ఫోన్ లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ విషయాలు తెలిసి వెనుకంజ వేస్తున్నారు.

Life Tricks

టీ తాగే ముందు నీళ్ళు తాగితే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

మనిషి బ్రతకడానికి కేవలం ఘన పదార్థాలే కాక ద్రవ పదార్థాలు కూడా అవసరం దాంట్లో నీరు ఎంతో ముఖ్యమైనది . నీరు కాక కాఫీ టీ లను తీసుకుంటారు అలాగే కూల్ డ్రింక్స్ కూడా తీసుకుంటారు. అయితే ప్రపంచవ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఆహారం లేకుండా అన్న ఉంటారేమో కానీ టీ కాఫీ లు లేకుండా ఉండలేరు అంతలా అడిక్ట్ అయిపోయారు వీటికి. కొంతమంది టీ కాఫీ లు త్రాగే ముందు నీళ్ళను త్రాగడం చూస్తాం.అలాగే మరికొందరు బిర్యాని తినగానే టీ తాగుతుంటారు . కారణం ఇరాన్ కల్చర్ లో బాగంగా పేగులకు అంటుకున్న ఆయిల్ కరిగి బిర్యాని వెంటనే అరిగిపోతుంది అంటారు. కానీ కాఫీ టీ లు త్రాగే ముందు నీటిని ఎందుకు త్రాగుతారు అంటే అది అలవాటు అంటుంటారు కానీ నిజంగా ఇలా నీరు త్రాగడం వలన ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఈ టీ కాఫీ లలోని కెఫెన్ శరీరానికి మంచి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక టీ లేక కాఫీ త్రాగడం వలన మంచి హుషారు వచ్చేస్తుంది

అలాగే వీటిలో ఎక్కువగా ఆసిడ్స్ ఉంటాయి వీటిని PH లలో కొలుస్తారు. కాఫీ లో ఈ PH లెవల్ 5 గా టీ లో 6 గా ఉంటుంది. వీటిని త్రాగే ముందు కొన్ని మంచినీళ్లు తాగడం వలన ఇందులోని ఆసిడ్స్ మన గొంతుపై అలాగే ప్రేగులపై ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి టీ కాఫీ లు త్రాగే ముందు నీటిని త్రాగడం శరీరంలో యాసిడిక్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది.

Life Tricks