Tags » New Features

Product Reviews Are Coming Back! Plus, Win $50 & See Your 2015 Sales Figures

Product Reviews Ahead

Plus, where to get your 2015 sales figures and our survey that can literally pay off

Product reviews are a great way to foster trust among the shoppers who love exploring the unique finds you offer at OpenSky, so we’re working to add this feature back to the site. 460 more words

OpenSky Announcements

PhotInfo 5.01.0

A new version of  PhotInfo is available on the App Store with an improved changing location view; now it is possible to choose a location from: 37 more words

News

Add your logo to your emails

Your logo represents your brand and identity. Be proud of it and show it off!

We are happy to announce that you can now add your logo to the emails sent to your clients. 12 more words

English Posts

ఈ ఫీచర్లతో వాట్సప్ యూజర్లకు పండగే; WhatsApp new Features

వాట్సప్.. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది నెటిజన్లకు ఇది వేదిక. దీనిద్వారా రోజుకు 4200 కోట్ల మెసేజ్‌లు, 250 కోట్ల వీడియోలు ఒకరికొకరుషేర్ చేసుకుంటున్నారని ఇటీవల వాట్సప్ యాజమాన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఈ 2016వ సంవత్సర కానుకగా వాట్సప్ వినియోగదారులకు యాజమాన్యం సరికొత్త ఫీచర్లను జోడించింది. వాటితో సెక్యూరిటీతోపాటు యూజర్లకు సంతోషాన్ని కలిగించగలమంటూ తెలియజేసింది. మరి ఆ ఫీచర్లేమిటో తెలుసుకుందామా..

 

ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐపాడ్ వంటి మొబైల్ వినియోగదారులు:

 

1. లాస్ట్ సీన్: వాట్సప్ వినియోగదారులకు ఈ పదం తెలియంది కాదు. ఈ ఫీచర్ ద్వారా తమ మిత్రులు వాట్సప్‌ను చివరగా వినియోగించిన సమయాన్ని తెలుసుకోవచ్చు. అయితే కొందరు తమను తాము సెక్యూర్‌గా ఉంచుకోవాలనుకుంటుంటారు. లాస్ట్ సీన్ ఫీచర్ ద్వారా తమ వాట్సప్ వినియోగ ఐడెంటిటీ బయటపడిపోతోందని తెగ ఇదై పోతుంటారు. అటువంటి వారికి ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసే సదుపాయాన్ని వాట్సప్ కల్పించింది. వాట్సప్‌లో లాస్ట్ సీన్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవడానికి.. సెట్టింగ్స్— చాట్ సెట్టింగ్స్– అడ్వాన్స్‌డ్ అండ్ సెట్ లాస్ట్ సీన్ టైమ్ టు ఆఫ్ ప్రాసెస్ద్వారా చేసుకోవచ్చు.

 

2. బ్యాకప్ ఫీచర్: ఫోన్ మార్చుకున్నా, ఫార్మాట్ చేసినా వాట్సప్‌లో చాట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అటువంటి సమయాల్లో ముఖ్యమైన మెసేజ్‌లన్నీ డిలీట్ అయిపోయాయని యూజర్లు బాధపడుతుంటారు. అటువంటి వారికి బ్యాకప్ ఫీచర్‌ను వాట్సప్ అందిస్తోంది. అండ్రాయిడ్ వినియోగదారులు.. సెట్టింగ్స్— చాట్ సెట్టింగ్స్ అండ్ ట్యాప్ బ్యాకప్ కంన్సర్వేషన్స్.. ద్వారా చాట్‌ను బ్యాకప్ చేసుకోవచ్చు. ఐఫోన్ వినియోదారులు.. సెట్టింగ్స్— చాట్ సెట్టింగ్స్– చాట్ బ్యాకప్– ట్యాప్ ఆన్ బ్యాకప్ నౌ… ద్వారా గతంలోని మెసేజ్‌లను పొందవచ్చు.

 

3. సెండ్ కన్సర్వేషన్ టు ఈ-మెయిల్: వాట్సప్‌లో ఫ్రెండ్స్‌తో చేసిన మెసేజ్‌లన్నింటినీ ఈ మెయిల్‌కు జతచేయవచ్చు. ఈ మెయిల్‌కు జతచేయగానే టెక్ట్ ఫార్మాట్‌లో మెసేజ్‌లు ఓపెన్ అవుతాయి. దీనికోసం వాట్సప్‌ను ఓపెన్ చేసి ఎవరైనా ఈ మెయిల్‌కు అటాచ్ చేయాలనుకున్న ఫ్రెండ్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. లెఫ్ట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దానిలో మోర్ ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో ఈ-మెయిల్ కన్సర్వేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

4. క్రియేట్ షార్ట్‌కట్స్: ముఖ్యమైన.. ఎప్పుడూ చాట్ చేసే ఫ్రెండ్స్ అకౌంట్స్‌కు షార్ట్‌కట్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కాంటాక్ట్‌లోకి వెళ్లి పైన రైట్ కార్నర్‌లోని మూడు నిలువు చుక్కలను క్లిక్ చేసి మోర్ ను సెలక్ట్ చేసుకోవాలి దానిలో యాడ్ షార్ట్ కట్ ను ఎంచుకోవాలి.

5. వాట్సప్‌ ఫ్రెండ్స్ ద్వారా వచ్చే పోటోలు కొన్ని బాగుంటాయి. మరికొన్ని అసభ్యకరంగానూ ఉండొచ్చు. ఒక్కోసారి వచ్చిన ఫోటోలే చాలా సార్లు వస్తుంటాయి. అలాంటి సమయాల్లో అన్ని ఫోటోలు గ్యాలరీలో కనిపిస్తుంటాయి. ఇది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతీసారీ గ్యాలరీలోకి వెళ్లి పోటోలను డిలీట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫోటోలను గ్యాలరీలో కనిపించకుండా చేయవచ్చు. దీనికోసం ఐఫోన్ వినియోగదారులు.. సెట్టింగ్స్– ప్రైవసీ– ఫోటోస్— టర్న్ ది ఆఫ్.. ప్రాసెస్‌ను ఫాలో అవ్వాలి. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రం ఫోటోలను గ్యాలరీలోకి రాకుండా చేయడం కష్టం.

 

6. వాట్సప్ ఫోన్ నెంబర్‌ను మార్చొచ్చు: మొబైల్ ఫోన్‌ను మార్చకుండానే, యాప్‌ను డిలీట్ చేయకుండానే వాట్సప్ కాంటాక్ట్ నెంబర్‌ను మార్చొచ్చు. దీనికోసం సెట్టింగ్స్– అకౌంట్– డిలీట్ మై అకౌంట్— చేంజ్ మై ఫోన్ నెంబర్… ప్రాసెస్‌ను ఫాలో అవ్వాలి. దీంతో పాటు సెట్టింగ్స్— అకౌంట్— చేంజ్ నెంబర్.. ద్వారా కూడా ఫోన్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

Districts

Contribution Statements-Print Date

Contribution Statements for 2015 have already been sent or donors have been emailed to log on and print their own. However, now might be a good time to think about all the… 236 more words

New Features

ReloSpec Express coming soon

Get there faster and easier with ReloSpec Express.  Today we are announcing ReloSpec Express and plan to have it available within the next couple weeks. 183 more words

411

New Features in OneNote At January 2016

Figure 1 – Image comes from https://blogs.office.com from the OneNote Whats New In January 2016 article

I was delighted to read that OneNote is getting a facelift. 115 more words

Microsoft