Tags » Offspring

ఆదికాండము 26:1-5 పై నా తలంపులు

అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమైనీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వ దించెదను; ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞ లను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

దేవుని ఆశీర్వాదాలు ఇస్సాకు జీవితములో ఎప్పుడు వచ్చాయి మరియు ఎందుకు వచ్చాయన్న ప్రశ్నలకు జవాబులు ఈ ఖండములో మనము చూస్తాము. మోట్టమోదటిదిగా, ఎప్పుడు వచ్చాయనేది చూస్తే, కరువు దినములలో అని వ్రాయబడివునది. అంతేకాకుండా ఇస్సాకు పరవాసియై పరదేశములో నివసించుచుండగా దేవుని ఆశీర్వాదములు పొందుకొనెనని మనము గమనించవచ్చు. రెండవదిగా, ఎందుకు వచ్చాయనేది చూస్తే, ముఖ్యముగా దేవుడు అబ్రాహాముతో చేసిన ప్రమానము నెరవేర్చుటకని మరియు అబ్రాహాము దేవునికి విధేయుడైయునాడు గనుక మరియు ఇస్సాకు సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడటానికని గమనించవచ్చు.

సార్వభౌమాధికారియైన దేవుడు సమస్తమును పాలించువాడు. ఆయన సృజించిన భూమ్యాకాశములు సూర్యనక్షత్రములు ఆయన ఆధీనములో ఉన్నవి. ఆయన వాటిని ఏలువాడు. అయితే ఇస్సాకు దినములలో వచ్చిన కరువు ఆయనకు తెలియనిది కాదు. అది ఆయన చేతనే జరిగింపబడినదని మనము గమనించవచ్చు ఏలయనగ ఈ లోకములో సమస్తము సార్వభౌమాధికారియైన దేవుని చిత్తము ప్రకారమే జరుగును. అయితే ఆ కరువును ఎందుకు రప్పించాడంటే, ఇస్సాకును తాను చూపించే దేశానికి తీసుకొని వెళ్ళడానికని మనము గమనించవచ్చు. తీసుకొని వెళ్ళిన దేవుడు “నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను” అని ఇస్సాకుతో వాగ్ధానము చేసాడు. ఏమని ఆశీర్వదించాడు అంటే, “ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి… నీ సంతానమునకును ఈ దేశములన్నియు” ఇచ్చెదనని ఆశీర్వదించెను. దీన్నిబట్టి మనము నేర్చుకోవలసినది ఏమిటంటే, దేవుని ఆశీర్వాదాలు దేవుని చిత్తప్రకారము తన ఇష్టానికి అనుగుణంగా ఉండే పద్ధతిలో తను వాటిని ప్రసాదిస్తాడు. అంటే మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా మనము వాటిని కోరుకోలేము మరియు పొందుకోలేము. దేవుడు ఇస్తేనే మనము వాటిని పొందుకోగలము.

దేవుడు ఇస్సాకును ఆశీర్వాదించాడు సరే, కానీ ఎందుకు ఆశీర్వాదించాడు? ముందు చూసినట్లు, అబ్రాహాముతో చేసిన వాగ్ధానమును నెరవేర్చుటకు. “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు… భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని” దేవుడు అబ్రాహాముతో వాగ్ధానము చేసాడు (ఆదికాండము 12:2-3). అదే వాగ్ధానాని అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు జీవితములో దేవుడు నెరవేర్చగోరాడు ఏలయనగా అబ్రాహాము దేవుని ఆజ్ఞలు గైకొని దేవునికి విధేయుడైయునాడు గనుక. ఇక్కడ మనము గమనించాలిసిన విషయము ఏమిటంటే, అబ్రాహాము మరియు ఇస్సాకు వారి వారి జీవితాలలో స్వార్ధముగా ఆశీర్వాదాలు అనుభవించటానికి వాటిని దేవుడు వారికి దయచేయలేదు కాని వారి ద్వార అనేకులు ఆశీర్వదింపబడాలని దేవుని కోరిక.

అయితే ఈ ఆశీర్వాదాలను అనేకులు ఎలా అనుభవించగలరు? అపోస్తులుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికలో దీనికి స్పష్టముగా జవాబు ఇచ్చాడు. “కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు” (గలతీయులకు 3:7-9). “అబ్రాహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు” (గలతీయులకు 3:16). “ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను” (గలతీయులకు 3:13).

దేవుడు అబ్రాహాముకు మరియు ఇస్సాకుకు ప్రమాణము చేసిన సంతానము క్రీస్తు. ఈ క్రీస్తు ద్వార మనము పాపక్షమాపనకు శాపవిమోచనకు నిత్యజీవమునకు సంబందించిన ఆశీర్వాదాలను విస్తారముగా అనుభవించగలము ఏలయనగా క్రీస్తు మన స్ధానములో మనము జీవించలేని పరిశుద్ధ జీవితము జీవించి, మన పాపాలు తన భుజాలపై మోసికొని మన స్ధానములో ఆ సిలువపై మరణించాడు మరియు మూఢవ దినము మృతులలోనుండి తను పునరుత్థానుడయ్యాడు. అది మనము విశ్వసించినయెడల దేవునిచేత ఆశీర్వదింపబడి పాపక్షమాపనను నిత్యజీవము మరియు పరిశుద్ధాత్మను పొందుకోగలము. మీరు ఆశీర్వదింపబడినవారా?

One Page Articles

The Love of a Father

And behold, a voice from heaven said, “This is my beloved Son, with whom I am well pleased.” ESV Matthew 3:17

Thirteen years ago today I became a father. 390 more words

Spiritual Formation

Angry Parents, Angry Children

Fathers, do not provoke your children to anger, but bring them up in the discipline and instruction of the Lord. ESV Ephesians 6:4

As parents we want the best for our children, and for that reason we often harp on every little thing. 356 more words

Spiritual Formation

Modern Rock Monday: "The Kids Aren't Alright" - The Offspring

Great song! I mean, a really great song from The Offspring. Crank it up!

Malays, Indians more open than Chinese to offspring dating outside their race

(Source: sg.news.yahoo.com)

Indians and Malays in Singapore are comfortable with their children and grandchildren dating outside of their race while the Chinese are a little less so, according to a new survey. 195 more words

Current Affairs

Jesus Loves Children

“Let the little children come to me and do not hinder them, for to such belongs the kingdom of heaven.” ESV Matthew 19:14

We are in the process of adoption meaning we spend some of our evenings reviewing profiles of potential matches. 366 more words

Spiritual Formation