Tags » Yamuna River

యమునా తీరాన వసుధ

యమునా నది కనిపించేటట్టు ఉంది ఆ కేఫ్ . పేరు కుడా ఏదో హిందీ లో ఉంది. పైగా ఆ చుట్టపక్కల కనిపించేటంతలో అదొక్కటే ఉంది. బవుసా వసుధ చెప్పింది ఇదే కావచ్చు. సగం ఆలోచనల్లోనే ఆ కేఫ్ వైపుకు నడిచాను. పెద్దగా రద్దీగా లేని చోటు అది. పైగా ఆఫీసు టైం కావడం వలన రొటీన్ డే లానే ఉంది వాతావరణం. అక్కడక్కడా ఉన్న జనాలతో నిండిన ఆ కేఫ్ లో చాలా ఖాళీ టేబుల్స్ కనిపించాయి. కార్నర్ లెఫ్ట్ టేబుల్ చైర్ పై కూలబడ్డాను. వస్తూనే ఫోన్ లో ఏదో నోటిఫికేషన్ రావడంతో పైజామా పాకెట్ లోంచి ఫోన్ తీసి చూసాను. ఏదో న్యూస్ నోటిఫికేషన్. ఇంతలో సర్వర్ వచ్చి గాజు గ్లాస్ లో కూలింగ్ వాటర్ తెచ్చి పెట్టి ఏదో పనిమీద ఉనట్టు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. బిజీగా ఉన్నప్పుడు ఎలాగూ ఇలాచేయడం మామూలే , కాని ఖాళీ గా ఉన్నప్పుడైనా కొంచం సౌమ్యంగా ఉండొచ్చుగా అనుకున్నా. మళ్లీ ఒకసారి మెస్సెంజర్ ఓపెన్ చేసి చూసుకున్నా. వసుధ లాస్ట్ సీన్ మార్నింగ్ అనే ఉంది. ఎందుకైనా మంచిదని “ఐ రీచ్డ్” అని మెస్సేజ్ పంపాను. ఆన్ లైన్ లో లేదు అనుకుంటా, మెస్సేజ్ సీన్ అని రాలేదు. నేను మళ్లీ ఫోన్ జేబీ లోకి తోసేసా.

ఇంతలో సర్వర్ వచ్చి “సర్ జీ , బోలియే” అన్నాడు. హిందీ లో ఏమేమి ఉన్నాయి అని అడిగాను. అతగాడు ఎలా పసికట్టాడో తెలీదు కానీ “మదరాసి ?” అని అడిగాడు. నేను తెలుగు అన్నాను. విచిత్రంగా అతగాడు తెలుగు మాట్లాడడం మెదలుపెట్టాడు. పోనీలే తెలుగు తెలిసినోడు దొరికాడు అని “ఫ్రండ్ వస్తుంది, కొంచం వెయిట్ చెయ్” అని చెప్పి పంపేసాను. టైం పట్టేలా ఉంది అని ఒక టీ చెబుదామనుకున్నా. అతగాడిని పిలిచి చెప్పేలోగా వసుధ రావడం కనిపించింది. నేను తనని అలా చూస్తూ ఉండిపోయాను. ఆమెను చూసి దాదాపు ఆరు ఏళ్ళు అయిపోయింది. దాదాపు అలానే ఉంది. ఏమీ మారలేదు. నన్ను చూసి పలరించినట్టు చిన్న నవ్వుతో ముందుకు వస్తుంది. మనిషి నవ్వు కూడా ఏమీ మారలేదు అని గతం గుర్తుకు వచ్చింది. ఆమె చేతిలో నెలల పాప ఉంది.

వచ్చి చనువుగానే ఎదురు చైర్ ను శబ్ధం వచ్చేలా లాగి కూర్చుంది. నిశబ్ధం నిండుకున్న ఆ కేఫ్ లోకి ఒక్కసారి అలజడుల ధ్వనులతో నిండుకుంది. నా మనుసు అనేక ప్రశ్నలు ఆ అలజడి లో ఊగిసలాడాయి. అంతే చొరవగా

“లేట్ అయ్యానా , సారీ , ఎంతసేపయింది వచ్చి ? ఏమైనా ఆర్డర్ ఇచ్చావా?” అని గడ గడా తనే పలకరించేసరికి నేను మౌనంగానే చుస్తూ ఉండిపోయా. అప్పట్లో ఎంత సిగ్గుగా ఉండేదో ?పలకరించినా మాటలు ఉందేవి కావు.

ఇంతలో ఎంత మార్పు. ఎంత కాంఫిడెన్స్. ఆడవారు అంత కాంఫిడెంస్ నిండిన మాటలు మాట్లాడితే నాకు భలే ఇష్టం.

“ఎంటీ ఏమీ మట్లాడడం లేదు, ఆర్ యూ ఓకే ?” అని కదిలించింది నన్ను వసుధ.

ఆ కేఫ్ లానే నా మనసు కూడా శూన్యంలా తోచింది నాకు. కావాలని మాటలు అతికించి “యా యా , ఇ యాం ఫైన్, థాంక్ యూ” అని తేల్చేసాను.

పాపను మా మధ్యన టెబుల్ పై అలానే పడుకోపెట్టేసింది. నిర్మలంగా నవ్వుతున్న పాప వైపు నా చూపు మళ్ళింది. పాప నన్నే చూస్తూ నాలిక ఆడిస్తూ చేతులు ఊపుతూ, నా దృష్టి అంతా దోచేస్తుంది. అప్రయత్నంగా గానే పాపను చూసి నవ్వేసాను. నా గంభీరత్వం సగం పాప ముందు ఓడిపోయింది. నాకు బదులాగా పాప కూడా నవ్వింది, నన్నే చూస్తూ. ఇక నేను కావాలనే పాప బుగ్గను నిమిరాను.

“ఏం పేరు పాపది ?” అని అడిగేసాను.

హేండ్ బ్యాగ్ లో ఏదో శోధిస్తున్న వసుధ తల నా పైపు తిప్పకుండానే , “ఏయ్, చెప్పాగా పాప పేరు నీకు, మర్చిపోయావా ?” నన్ను చూడకుండా అనేసింది.

ఒక్కసారిగా పాలసీసా దొరకడంతో నా వైపు తిరిగి చూసింది. నేను ఏమీ తోచని వాడిలా పాప పేరు గుర్తు రాక అమాయకంగా నవ్వుతూ పాప ను చూస్తూ ఉండిపోయాను. పాప నా అవస్త చూస్తూ నవ్వుతూనే ఉంది.

గతం అంతా పూసగుచ్చినట్టు గుర్తొస్తుంది కానీ , పాప పేరు మాత్రం గుర్తు రావడం లేదు. నేను బవుసా ఆ గతపు తీరంలోనే ఊండిపోయాను ఇనాళ్ళూ, అందుకే ఎప్పుడూ వసుధను కలవలని అనిపించలేదు అని నన్ను నేనే ప్రశ్నించుకున్ననాను. నన్ను వర్తమానం లోకి లాగేలా

“ఇంకేంటి , చెప్పు సంగతులు , ఎన్నాళ్ళు ఈ ట్రిప్ , ఎక్కడగా మీటింగ్ అన్నావు?,” అని ప్రశ్నలు ఒక్కొక్కటీ సంధిస్తుంది.

“కరోల్ భాగ్, మా హోటల్ రూం కూడా అక్కడే ఇచ్చారు” అని అన్నాను.

“ఇంతకీ పాప పేరు గుర్తురాలేదు కదూ నీకూ” అని నవ్వేసింది.

వసుధ నవ్వు దగ్గరగా చూసి చాలా కాలం అయ్యింది.

“మర్చిపోలేదు కానీ, గుర్తురావడం లేదు” అన్నాను.

“అబ్బో కవిలానే మాట్లాడుతున్నావు, అవునూ అసలు కాలేజ్ లొ తెలుగు అంటేనే పడెది కాదు కదా , నువ్వు తెలుగు కవివా ? హౌ స్ట్రేంజ్” అని మాటలు ప్రవాహం లో సాగిపోతుంది తను. నేను ఇబ్బందిగానే నవ్వాను.

“అవును ఆ కాలేజ్ రోజులు అన్నీ గుర్తున్నాయా ఇంకా నీకు ?”

“మర్చిపోవడామా , రోజూ అరవింద్ కి ఇవే చెపుతూ ఉంటాను. నన్ను వదిలేయ్ వసు, ఎన్ని సార్లు చెబుతావు అవే సంగతులు అంటుటాడు అరవింద్. అయినా నేను అస్సలు వదలను. మనం టూర్ లో నాతో డాన్స్ చేస్తూ నువ్వు కింద పడిపోయిన సంగతి అయితే మేము ఎన్ని చెప్పుకుని నవ్వుకున్నామో, కదూ మీనూ” అంతూ కూతురు వైపు ముద్దుగా నవ్వుతూ చుస్తూ చెప్పింది.

నేను ఆర్టిఫిషియల్ గానే నవ్వుతూ ఉండిపోయాను.

“పాప పేరు మీనూ నా , మరొకటిఏదో చెప్పినట్టున్నావ్ ?”
“ఏయ్ , నీకు మతిమరుపు బాగా పెరిగిపోయింది. మీనూ మా ముద్దు పేరు , కదూ మీనూ” అంటూ పాప , వసుధ ఇద్దరూ నవ్వేసారు.
నేను ఏమీ తోచనట్టు ” అరవింద్ ఆఫీస్ కి వెళ్ళిపోయారా ?” అని అడిగాను.
“లేదు ఈ రోజు నువ్వు వస్తున్నావు గా , నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఇప్పుడే వెళ్ళాడు. ఆఫీస్ బాగా దూరం. బవుసా ఇంకా వెళుతూ ఉంటాడు”
“నేను వస్తున్నట్టు అరవింద్ కి తెలుసా ?”
“హ , తెలుసు , అందులో ఏముంది”
నేను మౌనంగానే ఉండిపోయాను. ఏదో అడగాలి అని కొంచం మౌనం తరువాత “మీ ఫ్లాట్ ఎక్కడ ?” అని అడిగాను.
“పక్కన గల్లీ లో , 2 మినిట్స్ వాక్” అనింది

బవుసా నన్ను తన ఇంటికి ఆహ్వానిస్తుంది ఏమో అనుకుని ఎలా సున్నితంగా తిరస్కరించాలో ఆలోచించుకుంటూ సమాధానం తయారుచేసుకుంటున్నా.
ఇంతలో తన ఫొన్ మ్రొగింది. ‘ప్రెమంటే సులువు కాదురా’ ఖుషి రింగ్ టోనే ఉంది. అది అప్పట్లో మాకు ఎంతో ఇష్టమైన పాట. ఆ పాట మేము నా సోనీ వాక్ మేన్ లో చెరో హెండ్ ప్లగ్ తో షేర్ చేసుకుని కొన్ని వేల సార్లు విన్నాము. ఎందుకో ఆ రింగ్ టోన్ నిద్రలొ ఉన్న జ్ఞాపకాలను కుదుపుతుంది.

“అరవింద్ ఫోన్” సగం రింగ్ లోనే ఫొన్ ఆన్సర్ చేస్తూ ” హా, అరవింద్ చెప్పు , ఏంటీ మళ్ళీ ఐ ప్యాడ్ మర్చిపోయావా. హా వస్తున్నా” “చస్తున్నా ఈ మతిమరుపు జనాలతో” అని తనలో తానే అనుకుంటూ , “అరవింద్ వచ్చాడు, ఫ్లాట్ దగ్గర ఉన్నాడు అట” అంటూ తన బ్యాగ్ తీసుకుని బయలుదేరబోయింది.

సర్దుకుంటూనే “టైం ఉంటే ఓ సారి ఫ్లాట్ కి రా” అని చిరునామా లేని ఆహ్వానం అందించింది.
ఇంతలో రెండు టీలు వచ్చాయి.

“టీ తాగేసి స్టార్ట్ అవ్వు, వేడిగా ఉంది, వేడిగా ఉంటే నీకు ఇష్టం కదా నీకు” అని నేను మాటలు ముగిస్తుంటే

“యూ నో , నేను ఆసలు ఈ మధ్యన వేడిగా తాగటంలేదు, సం అదర్ టైం” అని మీనూ ను ఎత్తుకుంది.

“సారీ ఇ హేవ్ టూ మూవ్, తప్పకుండా ఫ్లాట్ కి రా , మన కాలేజ్ విషయాలు బోలెడు మాట్లాడుకోవలి , క్యాచ్ యూ లేటర్ , బాయ్” అంటూ మరొకసారి ఆహ్వానం అందించింది.

నేను కొంచం సేపటికి తేరుకుని , నవ్వుకుని , ఫోన్ తీసుకున్నా , రెండూ టీలు నేనే తాగేసాను. ఫోన్ వాల్ పేపర్ వసుధ ఫొటో తీసేసి మొన్న మనాలి

మంచు కొండల్లో తీసుకున్న నా సెల్ఫీనీ చేంజ్ చేసాను.

మనసు నిండుగా బిల్ కట్టడానికి కౌంటర్ వైపుకు కదిలాను.

దాదాపు నా వయసు ఉన్న వ్యక్తి ఎవరి కోసమో ఎదురుచూస్తూ అప్పుడప్పుడూ ఫొన్ చూసుకుంటున్నాడు.

మనసులో నవ్వుకుని బిల్ కట్టేసి డిల్లీ వీధుల్లో పడ్డాను.

(యదార్ధ కల్పితము)
– మూర్తి కనకాల

Telugu Movies

Subduing Kāliya


Krishna’s Punishment to the Serpant Kaliya was Actually a Benediction

I love the stories and pastimes in the Krsna Book, and never tiring of hearing them. 4,296 more words

A.C. Bhaktivedanta Swami Prabhupada

Guess.What.Day.It.Is?

Caleb heading to Taj Mahal this morning.

Notes:

Quotes

NEW DELHI: The Yamuna river, along whose stretch the capital was founded, has become clogged with filth and pollution, and is slowly dying.

Delhi hides its river and blocks access to it. 463 more words

India

TAJ MAHAL & AGRA FORT - AGRA

  1. Destination: Agra
  2. Time to Visit: Any time.
  3. Suggestion: If possible, visit early in the morning. It could be very crowded later in the day.
  4. Date of travel: …
  5. 848 more words
City

Yamuna Augmentation Canal Breach - Man-made Disaster?

A 75 feet wide breach on right bank of Yamuna Augmentation Canal (AC) has drowned vast agricultural land area belonging to three villages of Alahar, Palewala and Nachron falling under Radaur block of Yamuna Nagar district, Haryana. 3,336 more words

Yamuna